
- అదికార పార్టీ పెద్దలు ఆశీర్వాదం ఉంటే ఎదైనా చేయోచ్చు అనడానికి ఇదే నిదర్శనం
ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం, మారేపల్లి రెవెన్యూ సర్వే నెంబరు 115లో కోట్లాది రూపాయలు విలువ చేసే 23 ఎకరాల 15 సెంట్లు దేవుని భూమికి రెక్కలు వచ్చాయని అధికార పార్టీ పెద్దలు ఆశీర్వాదం ఉంటే ఎదైనా చేయోచ్చు అనడానికి ఇదే నిదర్శమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పెర్కోన్నారు. సోమవారం అయిన ఓప్రకటన విడుదల చేసారు. దురాక్రమణకు గురైనా.భూమిని రెవెన్యూ రికార్డుల్లో 22 ఎ 1(సి)లో నమోదు చేసి భూమిని వెంటనే స్వాదీనం చేసుకోవాలని ఆక్రమిత భూములకు బోర్డులు పెట్టాలని డిమాండ్ చేసారు, ఈభూమి పూర్వం శిస్తులకు దున్నుకున్న వ్యక్తులు దీనిపై హక్కులు కల్పించాలని,1999 లో విశాఖపట్నం మున్సిపల్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించగా ఆక్రమణ దార్లుకు ఈ భూమి చెల్లు బాటు కాదని ఆక్రమణ దార్లు వేసిన పిటిషన్ కోర్టు కొట్టువేసిన జడ్జిమెంట్ ఉందన్నారు 10 (1) రికార్డుల్లోను, సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్లోను దేవుని భూమిగా నమోదు అయ్యిఉందన్నారు, అయిన. దీనిని ఆక్రమణదారులు రికార్డుల్లో వారి పేర్లును చేర్చుకొని అదికార పార్టీ పెద్దలు అశ్వీర్వాదంతో అమ్మేసారని అన్నారు, అన్ని అదారాలు ఉన్న దీనిని స్వాధీనం చేసుకోవడంలో దేవదాయశాఖ అదికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ముగ్గురు అస్టేంటు కమీషనర్లును మార్చారని దీన్ని బట్టి ఈ అక్రమిత భూములు వెనుక ఎటువంటి అధికార పార్టీ పెద్దలు ఉన్నారో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఇంతటి దౌర్బగ్యాపు పరిస్థితిలు ఉండవన్నారు. ఈభూమి సెటిల్ మెంట్ కు ముందు కూడా 10(1)లో ఈభూమి మారేపల్లి గ్రామానికి చెందిన ఆవుగడ్డ స ఖూరినాయుడు ధర్మకర్తగా రికార్డుల్లో నమోదు అయిఉందనన్నారు 1956లో భూమి సెటిల్ మెంట్ అయిన తరువాత సెటిల్ మెంటు ఫేయిర్ అడంగల్ లో మారేపల్లి శ్రీ రాములు వారి పేరున నమోదై ఉందని దీన్ని తారువ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులకు ఏవిధంగా దఖలు పడిందని ప్రశ్ననించారు ఆక్రమణ దారునికి ఈ భూమి పై ఎటువంటి అధికారాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ఎండోమెంటు ట్రిబ్యునల్క్ వెళ్ళాలని, భూములు అమ్మిన వ్యక్తులు గాని, కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి గాని ఎటువంటి పాస్ బుక్కలు ఇవ్వరాదని స్పష్టం చేస్తూ గతంలో ఉన్న అనకాపల్లి దేవదాయశాఖ అస్టేంటు కమీషనర్ తేదీ 14/6/2022న దేవరాపల్లి తహశీల్దార్ వారికి వ్రాయడం జరిగింది. దీని ఆధారంగా తహశీల్దార్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇప్పటికే మూడు సార్లు పాస్ బుక్కలు తిరస్కరించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎండోమెంటు చట్టం లోని సెక్షన్ 81 ప్రకారం ఎదైనా మతపరమైన ఆస్తి అమ్మక మునకు లేదా ఆక్రమణకు చెల్లదని ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు ఫుల్ బెంచ్ రిఫరెన్స్ లో ఉదహరించిన తీర్పు లో ధార్మిక మరియు మతపరమైన ఎండోమెంటు యొక్క స్థిరమైన ఆస్తులు సెక్షన్ 43 ప్రకారం, ఆక్రమణదారునికి హక్కులు ఉంటే ఎండోమెంటు యాజమాన్యంను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళాలి. అట్ల చేయనియడల ఆక్రమణదారునికి ఎటువంటి హక్కులు వుండవని అన్నారు ఎండోమెంటు పాత సెక్షన్ 38/25 రిజిస్టర్లు ప్రకారం కూడా ఒక సారి రెవెన్యూ సెటిల్ మెంట్ ఫెయిర్ అడంగల్ మతపరమైన ఆస్తిగా రికార్డుల్లో నమోదు అయితే అది ఎండోమెంటు భూమి క్రిందనే ఉంటుందని దేవదాశాఖ చట్టం స్పష్టం చేస్తుందన్నారు. దీంతో పాటు 1999 విశాఖపట్నం మున్సిపల్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు వుందని. దీని ప్రకారం భూమిని వెంటనే స్వాధీనం చేసుకొని 22 ఎ 1 (సి) రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి దేవదాయశాఖ భూమిగా వెంటానే బోర్డులు పెట్టాలని కోరారు, అనకాపల్లి జిల్లా అసిస్టెంటు కమీషనర్ కు పలుమార్లు పిర్యాదులు చేయడం జరిగిందని. దీంతో దేవదాయశాఖ అసిస్టెంటు కమీషనర్ అనకాపల్లి వారు వారి సిబ్బందితో భూములు పరిశీలన చేసి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారని. కాని ఆక్రమణదారునిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇన్ని అదారాలు ఉన్న దేవాదాయ శాఖ అధికారులకు అధికార పార్టీ పెద్దలు ఒత్తుళ్లు తలవగ్గి ఆక్రమణదారులను దేవదాయశాఖ అదికారులు ఎమి చేయలేని నిస్సహాయిత స్థితిలో ఉన్నారని తెలిపారు. ఇప్పటికే ఈ భూమి అమ్మకాలు,కొనుగోల్లో లో కోట్లాది రూపాయలు అధికార పార్టీ పెద్దల చేతులు మారాయని తెలిపారు. అధికారం ఉంటే దేవుని భూములు కూడా అమ్మేసు కోవచ్చన్న అధికార పార్టీ పెద్దలకు భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. దేవదాయశాఖ అధికారులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళుకు తలవగ్గకుండా భూమిని వెంటనే స్వాధీనం కోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేర నుండి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కాపాడాలని 22A1(C) రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని భూములను వెంటనే స్వాధీనం చేసుకోని బోర్డులు పెట్టాలని వెంకన్న డిమాండ్ చేసారు,