Oct 07,2023 12:52

ఆసియన్ గేమ్స్‌-2023లో 100 పతకాలు సాధించిన భారత్ అదే జోరును కొనసాగిస్తుంది. పురుషుల క్రికెట్‌ ఫైనల్లో పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానం వేదికగా భారత్‌- ఆఫ్గానిస్తాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.  టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. భారత జట్టు మొత్తం నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగగా, మరోవైపు ఆఫ్గానిస్తాన్‌ తుది జట్టులోకి జుబైద్ అక్బరీ వచ్చాడు. 

బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ బౌలర్లు ఆది నుండి విరుచుపడ్డారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ 17 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. సాహిదుల్లా(45), నాయిబ్(18) ఆడుతున్నారు. 5 పరుగులు చేసిన జుబైద్‌ అక్బరీను శివమ్‌ దుబే పెవిలయన్‌కు పంపగా.. మహ్మద్‌ షాజాద్‌(4)ను అర్ష్‌దీప్‌ ఔట్‌ చేశాడు. 3 ఓవర్లకు 10/2 చేరగా, 13 పరుగుల వద్ద 3 వికెట్ ను కోల్పోయింది.  ఒక్క పరుగు మాత్రమే చేసిన జద్రాన్‌ రనటౌయ్యాడు. 15 పరుగులు చేసిన జజాయ్‌ బిష్ణోయ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో 49 పరుగులకు 4వికెట్లు కోల్పోయింది. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కరీం జనత్‌ కేవలం 1పరుగు చేసి షాబాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 11 ఓవర్లకు  53/5తో ఆఫ్ఘనిస్తాన్ పీకల లోతులో పడింది.

  • తుది జట్లు

భారత్‌:  రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్ష్దీప్ సింగ్

ఆఫ్గానిస్తాన్‌:  జుబైద్ అక్బరీ, మహ్మద్ షాజాద్(వికెట్‌ కీపర్‌), నూర్ అలీ జద్రాన్, షాహిదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, కరీం జనత్, గుల్బాదిన్ నైబ్(కెప్టెన్‌), షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, జహీర్ ఖాన్