Dec 08,2022 11:43

ప్రజాశక్తి-పెదవలస : ఆశా వర్కర్లు అదనపు భారం మోపి ఇబ్బందులు గురి చేయడం సరైంది కాదని సిఐటియు మండల కార్యదర్శి గడుతూరు సత్యనారాయణ అన్నారు. పెదవలస పిహెచ్ ఆశా డే మీటింగ్  రోజున సిఐటియు మండల కార్యదర్శి గడుతూరు సత్యనారాయణ దృష్టికి పోలీయో వివరాలు ఇంత వరకు పేపర్ వ్రాసి ఇచ్చెవాలం, కాని ఇప్పుడు టైప్ చేసి ఇవ్వాలని హెచ్ వి అంటున్నారు. దీని వలన ఆశా వర్కర్లకి అదనపు భారం పడుతుంది. ఆశా వర్కర్లకి ఒక్కొక్కరికి 100 నుంచి 200వరకు అదనపు భారం పడుతుంది. కావూన దీనికి దృష్టిలో పెట్టుకొని గతం లాగ వ్రాసిన లిస్ట్ తీసుకోవాలని సత్యనారాయణ అన్నారు. అలాగే జికె వీధి పిహెచ్ లో రకరకాల అదనపు పనులు అప్పజెప్పి, ఈ పనులు చేయకపోతే, భవిష్యత్తులో తోలగిస్తామని బెదిరించడం సరైంది కాదన్నారు. భవీష్యత్ లో అనేక సమస్యలు వస్తాయి కాబట్టి కార్మికులు అందరూ కలిసి కట్టుగా ఉండలాని కోరారు. అలాగే 20న పాడేరులో జరుగు సిఐటియు జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కోరారు.