బెంగుళూరు: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన అన్నాడీఎంకే మాజీ నేత శశికళ ఆస్పత్రి నుండి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. బెంగుళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందిన శశికళకు ఈ మధ్యే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం విధితమే. చికిత్స అనంతరం ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రసుత్తం తమిళనాడులో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. ఈ సందర్భంగా శశికళ విడుదల కావడంతో ఆసక్తి నెలకొంది.
అక్రమాస్తుల కేసులో శశికళ బెంగుళూరు పరప్పన అగ్రహారం జైల్లో నాలుగేళ్ల శిక్షను అనుభవించారు. ప్రస్తుతం ఆమె విడుదల సమయం దగ్గర పడుతోంది. ఇంతలోనే ఆమె అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఈరోజు డిశ్చార్జ్ సందర్భంగా ఆస్పత్రి వద్ద అనేకమంది ఆమె అభిమానులు తరలివచ్చారు. అయితే.. శశికళ మరికొన్ని రోజులు బెంగుళూరులోనే ఉండే అవకాశాలున్నట్లు సమాచారం. మరోవారం రోజుల తర్వాతే ఆమె చెన్నై వెళ్లే అవకాశముంది.










