ఎన్నాళ్లుగానో వాళ్లు అలా చేతులు జోడించే నిలుచున్నారు
ఆ కళ్ళలో ఎండిన ఊటబావుల ఆనవాళ్ళు
కనుబొమ్మల ముడులలో చిక్కుకుని
మొరాయించిన కాలంబోనులో ముద్దాయిలుగా జీవితాలు
అక్కడ ఇన్నాళ్ల రహస్యమేదో గొంతు విప్పుకుంటుంది
నేరమేమిటో తెలిసీ తప్పుకున్న నువ్వూ,నేనూ దోషులమని తేలుతాం
సంభాషణ హోరుమంటుంది
ఊపిరి బిగబట్టి వింటున్న నల్లని ఆకాశం
ఉత్తరదిక్కున ఎర్రబడుతుంది
సరిహద్దు చెరిపిన ఊపిరి పాదం ఉప్పైనై బతుకుసాళ్ళలో
చివుర్లు తొడిగిన పోరాటదృశ్యాన్ని మోసుకొస్తుంది
ఇప్పుడిక ముడుచుకున్న చేతులన్నీ
బిగించిన పిడికిళ్లే అవుతాయి
రాజ్యమా ఇప్పుడన్నా కళ్లగంతలు విప్పుచూడు
ఆకాశాన్నంటిన అరిగోస నీకర్థమవుతుందేమో..
* లావణ్యసైదీశ్వర్, 9603763848