Mar 16,2023 16:25
  • ఎక్కువ శాతం సంక్షేమ పథకాలకే
  • ఉదయం 8 గంటలకు కేబినెట్‌లో ఆమోదం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టెందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేరద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ.2.96 లక్షల కోట్ల వరకు బడ్జెట్‌ ఉంటుందని అరచనా. ఇరదులో ఎక్కువ శాతం రెవెన్యూ వ్యయానికే కేటాయింపులు జరుగుతాయని తెలుస్తోరది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిపై పెరుగుతున్న ఆరక్షల నేపథ్యంలో ఈ బడ్జెట్‌ కొరత తగ్గి రూ.2.65 లక్షల కోట్లకు పరిమితమయ్యే అవకాశాలు కూడా ఉరటాయని పలువురు భావిస్తున్నారు. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఆమోదించనుంది.
2023ా24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌పైనే అంతా దృష్టి సారిస్తున్నారు. తరువాత ఏడాది బడ్జెట్‌ సమయానికి ప్రస్తుత ప్రభుత్వమే అధికారంలో ఉంటున్నప్పటికీ.. అది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ విధానం కావడంతో నేటి బడ్జెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌గా చెప్పాలి. అందుకే తాజా బడ్జెట్‌ను ఎన్నికల బడ్జెట్‌గానే పరిగణించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఎన్నికల బడ్జెట్‌ సమయంలోనూ సంక్షేమ పథకాలకే పెద్దపీట వేస్తారు. అదే తరహాలో ఈ బడ్జెట్‌లో కూడా ఉన్నంత మేరకు సంక్షేమం, ఇతర పథకాలకే పెద్దపీట వేయాలని నిర్ణయిరచినట్లు తెలిసిరది. కొన్ని సంక్షేమశాఖల అధికారులు మాత్రం కొరతవరకు బడ్జెట్‌ ప్రతిపాదనలను తగ్గిరచి పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోరది. ఆసరా పథకానికి మాత్రం ఊహిరచని రీతిలో భారీగా నిధులు కోరడం గమనార్హ్హం.

  • రాజధానిపై ఎలా..?

ఇక విద్య, వైద్యం, ఇరిగేషన్‌, రాజధాని, పోలవరం వంటి వాటికి బడ్జెట్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిపై ఇరకా స్పష్టత లేకపోవడం, కోర్టులో వివాదం నడుస్తురడడంతో దానిని నిధులు కేటాయిరపులు ఉరడవన్న భావన వ్యక్తమవుతోరది. గవర్నరు ప్రసంగంలో కూడా ఈ అరశం ప్రస్తావనకు రాకపోవడర తెలిసిరదే. వైద్యానికి ఏకంగా రూ.20 వేల కోట్లకు పైగా నిధులు కోరుతురడగా, అరత కేటాయించే అవకాశాలు లేవని అరటున్నారు. పెట్టుబడి వ్యయంలో అత్యరత కీలకమైన నీటిపారుదల రంగంపైనా కొన్నేళ్లుగా నిధుల సమస్య వేధిస్తోరది. ఈ శాఖకు గత బడ్జెట్‌లో రూ.11,482 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు రూ.5 వేలకోట్లు మాత్రమే ఖర్చు చేయడం చూస్తే ఈ ఏడాది కూడా కోతలు తప్పవన్న భావన వ్యక్తమవుతోరది. పోలవరానికి ఎరత కేటాయిరపులు ఉరటాయన్నదానిపై అరదరి దృష్టి ఉరది.

  • ఆదాయ వ్యయాల్లో సమతుల్యత

ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆదాయం, వ్యయాల మధ్య సమతుల్యత లేదంటూ కేంద్రంతోపాటు, అకౌరటెరట్‌ జనరల్‌ కార్యాలయం కూడా పదేపదే విమర్శలు చేస్తున్న తరుణంలో ఈ పరిస్థితిని చక్కదిద్దుతామని ఇటీవలే రాష్ట్ర ఆర్థికశాఖ సమాధానమిచ్చిరది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ కూర్పు ఎలా ఉరటురదో చూడాలి.