Nov 06,2023 08:24

ఖాట్మండ్‌ :   నేపాల్‌లో వరుస ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 4.38 గంటలకు భూప్రకంపనలు సంభవించనట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ (ఎన్‌సిఎస్‌) తెలిపింది. ఖాట్మండుకు వాయువ్యంగా 169 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో ఆదివారం అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోలేదని పేర్కొంది. శనివారం మధ్యాహ్నం కూడా 3.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది.

శుక్రవారం రాత్రి నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపంలో 157 మంది మఅతి చెందారు. గడచిన ఎనిమిదేళ్లలో నేపాల్‌లో సంభవించిన అత్యంత భారీ భూకంపం ఇదే.  2015లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో సుమారు తొమ్మిది వేల మంది మఅతి చెందగా, 22 వేల మంది గాయాలపాలయ్యారు.