
ప్రజాశక్తి-*నర్సీపట్నం టౌన్ : మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్వర్యంలో మొబైల్ అన్న క్యాంటీన్ ప్రారంభం మున్సిపాలిటీలో ఏరియా ఆసుపత్రి వద్ద సోమవారం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మొబైల్ అన్న క్యాంటీన్ ప్రారంభం చేశారు. ఈ సందర్భముగా అయ్యన్న మాట్లాడుతూ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, పేద ప్రజల ఆకలి తీర్చడమే తెలుగుదేశం లక్ష్యం అని, జగన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్న క్యాంటీన్లను మూసివేసి తాత్కాలిక ఆనందం పొందుతున్నాడని పేదోడి నోటి దగ్గర ముద్దనూరు లాక్కునే జగన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని అన్ని దానాల కంటే అన్న దానం గొప్పది అన్న స్ఫూర్తితో, పేదల ఆకలి తీర్చడం కొరకు అన్నా క్యాoటీన్ ప్రారంభిచాము అని అన్నారు. లక్షలాదిమంది పేదల ఆకలితీర్చిన అన్నా క్యాంటీన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని ఈ క్యాంటీన్ నందు 2 రూపాయలకే భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను అవస్థలపాలు చేసి, అన్ని వ్యవస్థలను నాశనం చేసారని, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాక ఎన్నో సంస్కరణలు తెచ్చారని, పేదవాడి ఆకలి తీర్చారని, అందరిలో రాజకీయ చైతన్యం తెచ్చారని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారని ఆయన వివరించారు. అందుకే ఆయన మహానుభావుడు అయ్యాడని, మహానుభావుడు అవ్వాలంటే మహోన్నత వ్యక్తిత్వం, ఆదర్శమైన లక్షణాలు ఉండాలన్నారు. కానీ ఇప్పుడు వేరొక రకం మహానుభావులను చూస్తున్నామని పరోక్షంగా జగన్ కు చురకలు అంటించారు. అన్ని వ్యవస్థలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, వైసీపీ ప్రభుత్వం తీరీ లక్ష కోట్ల భక్షకుడు, రావణ పాలన అన్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. టిడ్కో ఇళ్లను లభ్డిదారులకు ఇవ్వకుండా నాలుగు సంవత్సరాలుగా తాత్సారం చేసారని, ఇల్లు ఇవ్వకుండానే గొప్పలు చెప్పుకుని రంగులు వేసుకున్నారని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో పరిశ్రమలు లేక నిరుద్యోగం పెరిగిందని నిరుద్యోగులను స్మగ్లర్ లుగా తయారు చేసారని, దేశంలో గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ లో మన రాష్ట్రాన్ని నిలబెట్టాయని ఆయన అన్నారు. రైల్వే జోన్ ప్రత్యేక హోదా తెస్తామన్న మాటలను ఎందుకు గాలికి వదిలేశారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నాయుకులు దొరికిందల్లా దోచుకుని పబ్బం గడుపుకుంటున్నారని అందుకే మళ్ళీ తెలుగుదేశం పూర్వవైభవాన్ని తీసుకు వస్తుందని దీమా వ్యక్తం చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్,డబ్బీరు శ్రీకాంత్, జెడ్పీటీసీ సుకల రమణమ్మ కొరుప్రోలు శ్రీను, అప్పలరాజు, నియోజకవర్గ నాలుగు మండలాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.