- పశువైద్యం మరింత వేగవంతం అయ్యింది
ప్రజాశక్తి - కశింకోట : పశువైద్యం మరింత వేగవంతం అయ్యింది అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రెండో విడత కింద అనకాపల్లి నియోజకవర్గంలో కసింకోట మండలానికి కేటాయించిన మొబైల్ వెటర్నరీ అంబులెటరీ క్లినిక్ ను గురువారం బయ్యవరం గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రారంభించారు. పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ బెహరా ప్రసాదరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ పశు జీవ సంపద పరిరక్షణ పాడి అభివృద్ధి లక్ష్యంగా జగన్ సర్కారు మొదటి విడతగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున వాహనం కేటాయించగా వాటి ద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. దీంతో రెండో విడత కింద మరో వాహనం కేటాయించారన్నారు.1962 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయగా 108 మాదిరిగా అంబులెన్స్ చేరుకొని సకాలంలో పశువైద్యం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గొల్లవిల్లి జయ , అనకాపల్లి సహాయ సంచాలకులు డాక్టర్ బి సౌజన్య, జగనన్న పాలవెల్లువా నోడల్ ఆఫీసర్ డాక్టర్ పి భాను బాబు,కసింకోట అల్పహన్స్ జార్జ్ నర్సింగబిల్లి చైతన్య మణి , పి. స్వామి నాయుడు గారు, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










