- పార్టీలో యువతకు ప్రధాన్యత
ప్రజాశక్తి - కశింకోట : కష్టపడే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఇస్తాం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. మండలం, లోగొబ్బూరు గ్రామంలో జరిగిన కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమం జరిగింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కాఫీ త్రాగారు. కార్యకర్తలకూ భరోసా కల్పించేందుకు ప్రతీ గ్రామంలో పార్టీ శ్రేణులను కలుస్తున్నమని అన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలకాలని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కాయల మురళి, జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణ మూర్తి, మండల ప్రధాన కార్యదర్శి పెంటకోట రాము, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు నైనంశెట్టి రమణారావు, మళ్ళ సూర్యారావు, మళ్ళ బాబు, పప్పల అప్పారావు, గోర్లి వెంకట రమణ, మొల్లేటి లక్ష్మీ నారాయణ, బుద్ద శేసు, మళ్ళ గణేశ్, కలగా సోమేశ్వర రావు, అక్కు నాయుడు, సిద్దిరెడ్డి సూర్యనారాయణ, ఉల్లింగల రమేష్, ఆనాల తాతినాయుడు, తదితరులు పాల్గొన్నారు.










