Mar 20,2023 16:45

ప్రజాశక్తి-రాంబిల్లి : సోమవారం రాంబిల్లి మండల కేంద్రం తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి ఉద్యోగులు, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి, తాసిల్దార్ భాగ్యవతికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి దేవుడు నాయుడు మాట్లాడుతూ నేడు చలో విజయవాడ చేపట్టిన అంగన్వాడి ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ధమనకాండ ప్రదర్శిస్తూ పోలీసులు ఎక్కడకక్కడ అంగన్వాడీ ఉద్యోగుల అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో అంగన్వాడి ఉద్యోగులకు న్యాయం చేస్తామన్న జగన్ సర్కార్, నేడు మాట తప్పి వాళ్ల న్యాయమైన సమస్యలు కనీసం వినకుండా అరెస్టులు చేయడం అంటే ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడి ఉద్యోగులకు గ్రాడ్యుటి అమలు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు కరెంటు గ్యాస్ చెల్లించాలని, పిఎఫ్ ఎస్ఐ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యాలు కల్పించాలని,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సీనియార్టీ ఆధారంగా ప్రమోషన్స్ ఇవ్వాలని, ఫేస్ యాప్ లు రద్దు చేయాలని, మెనూ తగ్గట్టుగా బిల్లులు ఇవ్వాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఐసిడిఎస్ కి తగినన్ని నిధులు కేటాయించాలని మా న్యాయమైన సమస్యలు పరిష్కరించుకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమం అనంతరం తాసిల్దార్ గారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మినీ టీచర్లు హెల్పర్లు పాల్గొన్నారు.