ప్రజాశక్తి-విశాఖపట్నం : భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆంధ్రా వైద్య కళాశాలకు చేరుకొని ముందుగా మొక్కలు నాటారు. అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరించారు. జిల్లా లో శనివారం నిర్వహించిన ఆంధ్రా వైద్య కళాశాల శత దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్ యస్.అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. వైద్యుల విరాళాలతో 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్లినికల్ అండ్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆంధ్రా వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కళాశాల ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు ఉన్న పరిస్థితుల ఛాయా చిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. ఈ పర్యటన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజని, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ అధ్యక్షులు జె.సుభద్ర, రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు, సియం రమేష్, పార్లమెంటు సభ్యులు బి.వి.సత్యవతి, ఎం.వి.వి. సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ జె. నివాస్, జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున, జివిఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ, సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ అధ్యక్షులు డా. టి.రవి రాజు, ఎ.ఎం.సి కళాశాల ప్రిన్సిపాల్ డా.బుచ్చిరాజు, కెజిహెచ్ సూపరింటెండెంట్ డా. పి.అశోక్ కుమార్, పలువురు జిల్లా వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.