ప్రజాశక్తి-గణపవరం : సూర్య బలిజ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గణపవరం గ్రామానికి చెందిన శెట్టి అనంతలక్ష్మి తన పదవీ కాలాన్ని పొడిగించినట్లు శనివారం చెప్పారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు స్థానిక శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు)ని భువనపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పు గుచ్చాలు అందించారు. ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ సూరి బలిజ కుటుంబాలకి చేస్తున్న కృషిలో భాగంగా ప్రభుత్వం అనంతలక్ష్మికి పదవీకాలం పొడిగింపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు శెట్టి రాజా తదితరులు పాల్గొన్నారు.










