ప్రజాశక్తి - కశింకోట : ఈనెల 18, 19లలో పరవాడలో అనకాపల్లి జిల్లా సిఐటియు 12 వ మహాసభ గొడ పత్రక ఆవిష్కరణ గురువారం జరిగింది. అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగే ఈ మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు విజ్ఞప్తి చేస్తున్నారు. అయన మాట్లాడుతూ కార్మిక చట్టాలు అమలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర హక్కుల కోసం ఉద్యోగ, కార్మిక, కర్షక , స్కీం వర్కర్లు, ప్రజలు, తరఫున న్యాయం కోసం రాజీలేని పోరాటాలు చేయడంలో ప్రథమ స్థానంలో సిఐటియు నిలుస్తుందని అన్నారు. ఈ సభలో కార్మిక చట్టాలు అమలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, స్కీం వర్కర్లు, బిల్డింగ్, ముఠా, అసంఘటిత రంగ కార్మికులు హక్కులకై తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ గోడపత్రిక ఆవిష్కరణలో, సాయిరాం, శ్రీదేవి, సూర్యలక్ష్మి, అమ్మాజీ ,చుక్క ఎర్రయమ్మ ,సన్యాసమ్మ వి సత్యవతి, పార్వతి, నూకరత్నం, నాగమణి, ఈశ్వరమ్మ, మహాలక్ష్మి ,భీమర శెట్టి అచ్చియమ్మ, తదితరులు పాల్గొన్నారు.










