Nov 09,2023 22:07

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్‌ మహిళా క్రికెటర్‌ మెగ్‌ లానింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. తన రిటైర్మెంట్‌ నిర్ణయం తక్షణమే అమలుకానున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలగడానికి ఇదే సరైన నిర్ణయమని భావించానని తెలిపింది. అలాగే తన రాజీనామా లేఖను ఆస్ట్రేలియా క్రికెట్‌బోర్డు(సిఏ)కు ట్విటర్‌లో పోస్ట్‌ చేసినట్లు గురువారం వెల్లడించింది. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌(డబ్ల్యుబిబిఎల్‌), మహిళల ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌)లలో మాత్రం కొనసాగుతానని ఆ ప్రకటనలో పేర్కొంది. 31ఏళ్ల లానింగ్‌ ఆస్ట్రేలియా తరఫున 182 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా.. 13ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 241 మ్యాచ్‌లు ఆడిన లానింగ్‌.. డబ్ల్యుబిబిఎల్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.