Oct 20,2023 12:43

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులు అమర జవాన్లను గౌరవించుకోవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీడీవో నరసింహ ప్రసాద్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వీకారం చుట్టిన మేరీ మట్టి... మేరా దేశ్ కార్యక్రమాన్ని ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ భారతదేశంలో పండే పంటలు ప్రపంచంలో ఏ దేశంలోనూ పండవని అందుకే మన దేశం తలమానికమైందని ఆయన అన్నారు. మనమందరం భారతీయులుగా గర్వించుకోవాలన్నారు. అనంతరం మండల వ్యాప్తంగా ఆయా గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సుబ్రహ్మణ్యం, ఈవో పి ఆర్ డి మూర్తి బాబు, మండల విద్యాశాఖ అధికారులు, అంగన్వాడి  సూపర్వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు.