Apr 14,2023 16:29
  • బీసీ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూరగాని లక్ష్మి 
  • ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ప్రజాశక్తి-చీరాల: భారతదేశ దిక్సూచి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని బీసీ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూరగాని లక్ష్మి అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీసీ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు,5 ఐదవ వార్డు కౌన్సిలర్ సూరగాని లక్ష్మి, నరసింహారావు దంపతుల  ఆధ్వర్యంలో స్థానిక ముక్కోన పార్క్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ కృషి చేయాలని, అలాంటి మహనీయుల ఆదర్శాలను ఈ తరం యువతకు తెలియజేస్తూ ఆదిశగా అందరు ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఆర్ వి యన్ మల్లేశ్వరావు, ధనుంజయ, సూరగాని పిచియ్య, భాస్కర్, నారాయణ, అసిరి నాయుడు, సూరగాని హనుమతురావు, వసంతరావు గుడిపల్లి వెంకట్రావు, శ్రీకాంత్, తులసి, తిరుపతిరావు పలువురు పాల్గొన్నారు.