ప్రజాశక్తి-అమరావతి : కృష్ణ జలాల వాటా కోసం సుప్రీంకోర్టులో పోరాడతామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కృష్ణ జలాలపై ఉన్న అడ్డంకులను తొలగించాలని కేంద్రాన్ని కోరామని ఆయన తెలిపారు. కృష్ణనది నీటి పంపకాలపై దశాబ్దాలుగా విభేదాలు ఉన్నాయని తెలిపారు. బ్రిజేష్ కుమార్ కొత్త విధి విధానాలు సరికాదని ఆయన తెలిపారు. 2010లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నివేదికను ఇచ్చిందని, అప్పుడు సుప్రీంకోర్టులో స్టే విధించిందని తెలిపారు. ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విధివిధానాలున్నాయని తెలిపారు. కొత్త విధివిధానాలతో కేంద్రం గెజిట్ విడుదల చేయడం సరికాదని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసి న్యాయం పరంగా పోరాడుతామని అన్నారు. రాష్ట్రానికి నష్టం జరిగే విధానాన్ని ఒప్పుకోమని స్పష్టం చేశారు. అన్యాయంగా ఒక్క బొట్టు కూడా వదులుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపారు.










