విజయవాడ: ప్రస్తుతం పోలవరం స్పిల్ వే నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఇది 8 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. పట్టిసీమ ద్వారా మళ్లీ కఅష్ణా డెల్టాకు నీరు అందించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. నాలుగేళ్ల తర్వాత పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు. పులిచింతలలో నీటిని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ ఉంచనున్నట్లు చెప్పారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా 5 టీఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. డయాఫ్రం వాల్ కొన్ని చోట్ల దెబ్బతిందని.. అయితే, కొత్తది నిర్మించాలా లేక పాత దానికే మరమ్మతులు చేయాలా అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర జల సంఘానికి నివేదిక ఇవ్వలేదని మంత్రి అంబటి తెలిపారు.










