నిజామాబాద్: కర్ణాటకలో కాంగ్రెస్ పాలనా తీరును చూసి అక్కడి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజెపి నేత ఈటల రాజేందర్ రెండు స్థానాల్లో పోటీ చేయడంపై ఆమె సెటైర్లు వేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు రేవంత్, ఈటల తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో వారికి వాతలు తప్పితే ఫలితం ఉండదన్నారు. నిజామాబాద్లో గోసంగి సామాజికవర్గం ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గన్నారు. కాంగ్రెస్, బిజెపి నేతల తీరుపై మండిపడ్డారు. కర్ణాటకలో చక్కదనం లేదుగానీ అక్కడి సీఎం కామారెడ్డికి వచ్చి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనలో అభివఅద్ధి ఏం జరిగిందో ఆలోచించి.. ప్రజలు ఓటు వేయాలని కవిత కోరారు.