హైదరాబాద్ : నీట్-పిజి, ఐఎన్‌ఐాసెట్, ఎఫ్‌ఎంజిఇ విద్యార్థుల కోసం సూపర్ యాప్‌ను ఆవిష్కరించినట్లు మెడికల్ కోచింగ్ సంస్థ అలెన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ యాప్ విస్తృత శ్రేణీలో వినూత్న ఫీచర్లను, వనరులను అందిస్తుందని పేర్కొంది. పిజి మెడికల్ విద్యార్థులు తమ విద్యా, నైపుణ్య లక్ష్యాలను సులభంగా సాధించేలా ఇది తోడ్పాటునందిస్తుందని పేర్కొంది.










