ప్రజాశక్తి-బుట్టాయిగూడెం : మండలం ఇప్పలపాడు సమీపంలో నిర్మించిన ఏకలవ్య గురుకుల విద్యాలయం భవన సముదాయాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము డిసెంబర్ నాలుగో తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్ లో నేవీ దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా వచ్చిన రాష్ట్రపతి వర్చువల్ విధానంలో ఈ భవన సముదాయాలను ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఏకలవ్య విద్యాలయాన్ని 2019 నుండి కే బొత్తప్పగూడెం గిరిజన సంక్షేమ పాఠశాల పాత భవనాలలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. అయితే నూతనంగా నిర్మించిన ఏకలవ్య విద్యాలయంలో తరగతులు నిర్వహించడానికి 6, 7, 8, 9 తరగతుల 240 మంది విద్యార్థులను ఈ నూతన పాఠశాలలోకి తరలించడానికి పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అకాడమిక్ బ్లాక్ బాల, బాలికల వసతి గృహాలు, వంటశాల, భోజనశాల రెండు వార్డెన్ క్వార్టర్స్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మాణానికి సుమారు 19.74 ఎకరాల భూమిని కేటాయించి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా 39 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ప్రస్తుత నిర్మాణాలు తొలివిడతగా 23 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇంకా మిగిలి ఉన్న పనులకు 16 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు మాట్లాడుతూ ఈ ఏకలవ్య పాఠశాల నిర్మాణానికి స్థలం దానం చేసిన బుద్ధుల ఉలయ్య లేకపోతే ఈ నిర్మాణం ఇంత త్వరగా త్వరగా పూర్తి అయ్యేది కాదని గుర్తు చేశారు ప్రస్తుత కాలంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఊలయ్య తన భూమిని దానం చేయడం ఎంతో ఆదర్శప్రాయం అని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇటువంటి ఏకలవ్య పాఠశాలను నిర్మించుకోవడానికి అన్ని రకాలుగా సహకారాలు అందించిన ఉన్నత అధికారులు గూర్చి మాట్లాడారు. ఈ పాఠశాలను చూస్తుంటే మేము చదువుకునే సమయంలో ఇలాంటి పాఠశాల ఉండి ఉంటే ఎంతో బాగుండేది అని అనుకుంటున్నాను అన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను చదువుకునే రోజుల్లో కలెక్టర్ ని అవుదాం అనుకున్నాను. కానీ అవ్వలేకపోయాను ఇలాంటి పాఠశాల ఉండుంటే కలెక్టర్ ని అయ్యే వాడినేమో అని గుర్తు చేశారు ప్రస్తుతం ప్రభుత్వం విద్యా వ్యవస్థకు సుమారు 52 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఈ పాఠశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు అందరూ సరియైన బాటలో నడుస్తూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఉన్నత స్థానాలకు ఎదగడానికి విద్య ఒక్కటే చదువు ఒక్కటే మార్గమని తెలియజేశారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో డిజిటల్ సేవలను అందిస్తుందని ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని, భారత రాష్ట్రపతి ఒక గిరిజన కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ గిరిజన కుటుంబానికి చెందిన వ్యక్తి భారతదేశానికే ప్రథమ పౌరురాలు అయింది అంటే కేవలం ఒక చదువు వలన మాత్రమే. మన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని ఈ ప్రాంత ప్రజలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడంతో ఇంగ్లీష్ మీడియం విద్య అనేది ధనిక సంపన్న లకు మాత్రమే కాదు పేద నిరుపేద విద్యార్థులకు కూడా అందించవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బుట్టాయిగూడెం మండలంలో కన్నాపురం రోడ్లో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, రానున్న కాలంలో సుమారు మూడు వేల నిర్వాసిత కుటుంబాలు ఈ ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి ఏకలవ్య పాఠశాల మరొకటి కావాలని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకు వెళ్తానని ఆ పాఠశాల నిర్మాణానికి అవసరమైన అనుమతులను అధికారుల ద్వారా తీసుకుంటామని ఈ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి మా ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ హేమలత, ఐటిడిఏ డిడి పివిఎస్ నాయుడు, పోలవరం ఏఎంసీ చైర్మన్ కరాటం సీతాదేవి, ఎంపీపీ కారం శాంతి, జడ్పిటిసి మోడియం రామ తులసి, వైస్ ఎంపీపీ జి మోహన్ రావు, కుక్కల వరలక్ష్మి, స్థానిక సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ, ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.










