న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆదివారం మరోసారి వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) ' పేలవమైన ' కేటగిరీగా చేరుకుంది. ఢిల్లీ అంతటా రెండోరోజు కూడా వాయు నాణ్యతా ప్రమాణం పేలవంగా కొనసాగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) తెలిపింది. సిపిసిబి నివేదిక ప్రకారం.. ఆదివారం ఉదయం 7.00 గంటల సమయంలో ఎక్యూఐ ఆనంద్ విహార్‌లో 266, ఆర్.కె.పురమ్‌లో 241, పంజాబి బాఘ్ 233, ఐటిఒ ప్రాంతంలో 227గా నమోదైంది. జిఆర్‌ఎపి 4 నిబంధనలను అనుగుణంగా ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం కురిసిన వర్షానికి కాలుష్యం కొంత మెరుగైన సంగతి తెలిసిందే. అయితే వర్షాలు కొంచెం ఉపశమనం కలిగించినప్పటికీ .. ఢిల్లీలో వాయు నాణ్యత నివాసితులకు ఆందోళన కలిగించే అంశంగా కొనసాగుతోంది.