
- జిల్లా నాయకులు డిడి వరలక్ష్మి
ప్రజాశక్తి - కశింకోట : కశింకోట మండలం నరిశింగబిల్లి గ్రామంలో అక్టోబర్ 5న డిల్లీ జరుగు బహిరంగ సభ జయప్రదం చేయాలని భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా నాయకురాలు డీ.డీ.వరలక్ష్మి కరపత్రాలు ఆదివారం పంచారు ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీన ఢిల్లీలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయినా స్వతంత్ర ఫలాలు దక్కడం లేదని అన్నారు.30% ప్రజలు తిండి,బట్ట,వసతి,విద్య,వైద్యం వంటి కనీస అవసరాలు అందలేదని అన్నారు. చంద్రయానం - 3లో 55మంది మహిళా శాస్త్రవేత్తలు ఘనమైన పాత్ర పోషించారు. మరోప్రక్క మహిళలపై హింస, అత్యాచారాలు పెరుగుతున్నాయి. వీటిని ప్రభుత్వాలు అరికట్టడం లేదు. దేశవ్యాప్తంగా మహిళా పోరు యాత్రలు జరుపుతూ ఢిల్లీలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళల సంఘం (ఐద్వా) కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలందరూ హాజరు అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి.శ్యామల, కె.భవాని, వి.రామలక్ష్మి, కె.మని, టీ.దేవి, కె.కుమారి, డీ .షర్మిల పాల్గొన్నారు.