Feb 15,2023 16:05

ప్రజాశక్తి - బుచ్చయ్యపేట : వడ్డాది వెంకటేశ్వర స్వామి ఆలయ భూమిలో నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల తాతయ్య బాబు తదితరులు బుధవారం స్థానిక డిప్యూటీ తహసిల్దార్ మురళికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పెద్దలు యావన్మంది దేవాలయ అవసరాల నిమిత్తం కొంత భూమిని కేటాయించడం జరిగిందని, సదరు భూమిలో గతంలో ప్రభుత్వం నుండి పక్కా ఇల్లు లబ్ధి పొందిన గ్రామానికి చెందిన దువ్వాడ శంకరరావు ఇంటి నిర్మాణాలను చేపడుతున్నారని తెలిపారు. ఉత్సవాలు తదితర అవసరాల నిమిత్తం కేటాయించిన స్థలంలో నిర్మాణాలు ఎలా చేపడతారని అధికారులు తీరుపై మండిపడ్డారు. అలాగే దేవస్థానం అధికారులకు సైతం ఫిర్యాదు చేశామని తెలిపారు. దేవస్థానం అధికారులు సైతం తహసిల్దార్ ఫిర్యాదు చేశారని తెలిపారని తెలిపారు. గ్రామ ,ఆలయ, అవసరాల నిమిత్తం కేటాయించిన స్థలంలో నిర్మాణాలు పై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వడ్డాది టిడిపి టౌన్ అధ్యక్షులు దొండా నరేష్ కోరుకొండ గురుమూర్తి, జి రాము తదితరులు పాల్గొన్నారు.