- మత్స్యశాఖ అభివృద్ధి సాయి సందీప్
ప్రజాశక్తి- రేపల్లె : సముద్రంపై వేట నిషేద సమయంలో ఎవరైనా మత్యవేటకు వెళ్ళితే చట్టపరమైన చర్యలు ఎదుర్కొనక తప్పదని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి పి. సాయిసందీప్ చెప్పారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి జూన్ 14వతేది వరకు సముద్రంలో వేటను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిందని, తూర్పు బంగాళాఖాతం సముద్రంలో తీరప్రాంత మత్స్యకారులు ఎవరూ చేపల వేట చేయరాదని చెప్పారు. వేటకు వెళ్ళిన వారిపై ఏపీ ఎంఎస్ఆర్ యాక్ట్ కింద చర్యలు తీసుకొనబడునన్నారు. ఈ కాలంలో వేటచేయని మత్స్యకారులకు నిషేధకాల భృతిని మంజూరు చేసేందుకు ఫిష్ లాండింగ్ సెంటరు వారీగా వేట నిషేధకాల జాబితాను తయారు చేయడానికి ఏప్రిల్ 17వతేదిన ఆయా పడవలను తనికీ చేసేందుకు తనికీ బృందం లాండింగ్ సెంటర్లకు వస్తాయన్నారు. మత్స్యకారులు తమ పడవలను తనికీ నిమిత్తం నిర్దేశించిన ఫిష్ లాండింగ్ సెంటర్లలో యాత్రమే అందుబాటులో ఉంచాలన్నారు. వేట నిషేధకాల భృతి పొందేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో లబ్ధిదారుడు కాని మత్స్యకారుడు మాత్రమే అర్హుడన్నారు. ఒక హౌస్ హెూల్డ్ను ఒక కుటుంబంగా పరిగణించబడునని, ఒక కుటుంబానికి ఒకరు మాత్రమే అర్హలన్నారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.1.20లక్షలలోపు ఆదాయం కలిగిన గ్రామీణులకు, రూ.1.44 లక్షలలోపు ఆదాయం కలిగిన పట్టణ ప్రజలు అర్హలని చెప్పారు. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తున్నా వారుగాని అనర్హులని చెప్పారు.










