Jul 08,2023 14:37

ప్రజాశక్తి - జీలుగుమిల్లి  : జీలుగుమిల్లిలోని సరిహద్దు  ఆర్టీఎ చెక్ పోస్ట్ కార్యాలయంలో శనివారం తెల్లవారుజామున  అవినీతి నిరోధక శాఖ ఏసీబీ డిఎస్పిపి. శరత్ బాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా  కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రైవేట్ వ్యక్తిగా ఉన్న డేవిడ్ కు చెందిన నివాసంలోను తనిఖీలు నిర్వహించి పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో అనధికారికంగా ఉన్న 1,23,000 నగదును స్వాధీన పరచుకుని డేవిడ్ తమ్ముడు అయిన సంతోష్ ను అదుపులోకి తీసుకున్నట్లూ ఆయన తెలిపారు. అదే విధంగా కార్యాలయ అధికారి (ఏ ఎమ్ వి ఐ) కల్యాణి వద్ద నుంచి కూడ కొంత నగదు (29,500)ను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. మరియు కార్యాలయంలో  ఉన్న పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లూ  డిఎస్పీ శరత్ బాబు  తెలిపారు.ఈ దాడులలో భాగంగా  ఏ ఎమ్ వి ఐ కల్యాణి ను, ప్రైవేట్ వ్యక్తి సంతోష్ ను అదుపు లోకి తీసుకొని వీరిని కోర్టు లో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఏ.సి.బి సి.ఐలు ఏసుబాబు, నాగేంద్ర  పలువరు సిబ్బంది పాల్గొన్నారు..