జిత్తుల మారి పనులు జేసి
పరుగెత్తుకు వచ్చింది
ఏ పొదల్లోనో దూరేసి దాక్కుంది
సర్కారు దాని ఆచూకి కై
అక్కడ చాటింపు వేయించింది
చుట్టూరా సహకారం కరువైంది
ఇక
శిక్షించాలని ఏకంగా నిప్పు పెట్టింది
నక్క చచ్చింది
కానీ
అడివిలో పశుపక్ష్యాదులన్నీ
అల్పజీవులన్నీ
అగ్నిజ్వాలలకు ఆహుతయ్యాయి
దోపిడీకి సహకారం
తప్పని పర్యవసానం
- కోటం చంద్రశేఖర్
9492043348










