
హైదరాబాద్ : యువ నటుడు, హరికాంత్ (33) శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. హరికాంత్ థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకొని... సినిమాల్లోకి వచ్చారు. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం 'కీడా కోలా' సినిమాతో బిజీగా ఉన్నారు. 'పెళ్లిచూపులు' ఫేమ్ తరుణ్ భాస్కర్ తీస్తున్న ఈ మూవీ టీజర్, రెండు రోజుల ముందు విడుదలైంది. ఇందులోనూ హరికాంత్ కీలకపాత్రలో నటించారు. ఇప్పుడు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు. హరికాంత్ మరణవార్తతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగింది. ఈ విషయాన్ని తెలుగు సినిమా పీఆర్‌ఓ ఒకరు ట్వీట్ చేశారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు నటీనటులు కోరుకుంటూ సంతాపం తెలిపారు.
&;