ప్రజాశక్తి - గంగాధరనెల్లూరు (చిత్తూరు) : గంగాధర నెల్లూరులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మఅతి చెందారు. సుమారు గంట వ్యవధిలోనే మృతుడి వివరాలను ఎస్.ఐ.రామాంజ సేకరించారు. గంగాధరనెల్లూరు లోని బస్టాప్ కూడలి నుంచి శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఓ వ్యక్తి చిత్తూరు వైపు నడిచి వెళుతూ పెట్రోల్ బంక్ వద్ధ అకస్మాత్తుగా కిందపడిపోయాడు. ఎవరో వ్యక్తి కింద పడిపోయాడని స్థానికులు వచ్చి చూసేలోపే అప్పటికే మఅతి చెందినట్లుగా స్థానికులు గుర్తించారు. ఈ విషయం పై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని మఅతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతి చెందిన వ్యక్తి తిరుపతి జిల్లా పాకాల మండలం మిట్ట గాదంకి గ్రామానికి చెందిన చెంగయ్య కుమారుడు నాగభూషణం (38)గా గుర్తించామన్నారు. ఈయన టీటీడీ విజిలెన్స్ శాఖలో 15 ఏళ్ళుగా విధులు నిర్వహించేవాడని, ఏ కారణంగానో నాలుగు నెలల క్రితం ఉద్యోగం నుండి సస్పెండ్ అయినట్లు, ఈయనకు ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నట్లు సమాచారం తెలిసిందని ఎస్ఐ తెలిపారు.