హైదరాబాద్ : సమయానికి జీతం పడలేదని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హౌంగార్డు రవీందర్ (38) శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవీందర్ కన్నుమూసినట్లు డీఆర్‌డీవో అపోలో వైద్యులు ప్రకటించారు. 70 శాతం కాలిన గాయాలతో ఉన్న రవీందర్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే నిన్న అతని పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈరోజు తెల్లవారుజామున రవీందర్ తుదిశ్వాస విడిచారు. హౌంగార్డ్ రవీందర్ మఅతిపై హౌంగార్డ్ జేఏసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
హోంగార్డుల ఆందోళనలు
రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటన హౌంగార్డులను తీవ్ర ఆవేశాగ్రహాలకు గురిచేసింది. విధుల బహిష్కరణతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యాచరణకు హౌంగార్డ్ జేఏసీ పిలుపునిచ్చింది. హౌంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలంటూ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. సకాలంలో హౌంగార్డులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రవీందర్‌కు మద్దతుగా హౌంగార్డులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని సంఘీభావం కూడా ప్రకటించారు. అయితే ఈరోజు రవీందర్ కన్నుమూశారు.
ఏం జరిగిందంటే ....
పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్‌లో హౌంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 5వ తేదీన) సాయంత్రం గోషామహల్‌లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్‌లోనే ఉన్న హౌంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకటి, రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన రవీందర్ తనతోపాటు సీసాలో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలైన రవీందర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించడంతో డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈరోజు తెల్లవారుజామున రవీందర్ మరణించారు.
రవీందర్ సహోద్యోగులు మాట్లాడుతూ ... సకాలంలో జీతాలు అందక.. బ్యాంక్ ఈఎంఐ చెల్లింపు ఆలస్యం అవుతోందన్న మనస్థాపంతో రవీందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నట్లు చెబుతున్నారు.
రవీందర్ భార్య సంధ్య మాట్లాడుతూ ... సకాలంలో జీతం అందకపోవడం మాత్రమే కాదని.. అధికారుల వేధింపులు కూడా తన భర్త ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కారణమని తెలిపారు. జీతాలు అందకపోవడం మాత్రమే కాదు.. ఇప్పుడు తన భర్తకి మంచి చికిత్స అందించలేని స్థితిలో ఉన్నానని, హౌంగార్డుల దుస్థితికి ఇది నిదర్శనమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ స్పందించాలని కోరారు. రవీందర్ ఆత్మహత్యాయత్నంపై రాజకీయంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.