
ప్రజాశక్తి -బుచ్చయ్యపేట(అనకాపల్లి) : మాజీ సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు శనివారం వడ్డాది, విజయరామరాజుపేట, దిబ్బిడి, తదితర గ్రామాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ విగ్రహాలకి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు, పావలా వడ్డీ రుణాలు వంటి సంక్షేమ పథకాలతో వైఎస్‌ఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. జడ్పిటిసి దొండా రాంబాబు, వైస్ ఎంపీపీ దొండా లలితా నారాయణమూర్తి, ఉప సర్పంచ్ దాడి సూరిబాబు, పిఎసిఎస్ అధ్యక్షుడు దొండా సన్యాసిరావు, వివిధ గ్రామాల సర్పంచులు పిఎసిఎస్ అధ్యక్షులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు, వైసిపి నేతలు పాల్గొన్నారు.