Nov 27,2022 12:36

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట సెయింట్‌ జాన్స్‌ స్కూల్‌ లో ఆదివారం యన్‌ సి సి దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సెయింట్‌ జాన్స్‌ ప్రిన్సిపల్‌ మహేష్‌ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ ... ప్రతి విద్యార్థి ఆత్మగౌరవం, దేశభక్తి కలిగి ఉండాలని, భవిష్యత్తులో రూపురేఖలు మారిపోతాయని యన్‌సిసి నైపుణ్యం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్‌ ఇన్‌ ఛార్జ్‌ రూపానంద్‌ సహా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.