Jul 25,2023 18:17

ప్రజాశక్తి-బియలమంచి(పశ్చిమగోదావరి) : వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలైన కనకాయలంక, పెదలంక గ్రామాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ.. టిడిపి ప్రభుత్వ హయాంలో చిన్నపాటి వరదలు సంభవించిన లంక గ్రామాల ప్రజలందరికీ బియ్యం ,కంది పప్పు ,మంచి నూనె, కూరగాయలు వంటి నిత్యావసర సరుకులు అందించి ఆదుకునే వారిమని తెలిపారు. ఇప్పటి వైసీపీ ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున వరదలు సంబవించిన ప్రజలను గాలికి వదిలేసే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తమ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారంగా పాలకొల్లు నియోజకవర్గంలో మొట్టమొదటిగా కనకాయలంక బ్రిడ్జి నిర్మాణంతోనే అభివృద్ధిలను పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ముస్కుడి రాంబాబు, ముస్కుడి శ్యాంబాబు, కుందేటి గంగరాజు, కడలి సత్యనారాయణ, నిమ్మల శ్రీనివాస్‌, పులి శ్రీరాములు, పెదలంక సర్పంచ్‌ తాళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.