Nov 08,2023 16:27

ప్రజాశక్తి‌-చిలకలూరిపేట  :  రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం చేసిన కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా సాగే పో రాటంలో అన్ని పార్టీలు, ప్రజలు కలిసి రా వాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మా జీ ఎమ్మెల్యే ఎం ఏ గఫూర్ పిలుపు నిచ్చా రు. స్థానిక కళామందిర్ సెంటర్ నందు బుధ వారం జరిగిన బహిరంగ సభకు సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై. రాధాకృష్ణ అధ్యక్షత వహించిన బహిరంగ సభలో గఫుర్ మాట్లాడుతూ అసమానత లు లేని అభివృద్ధి ధ్యేయంగా పోయిన నెల 30 వ తా రీకు కర్నూల్లో బయలుదేరిన ప్రజా ర క్షణ భేరి యాత్ర నరసరావుపేట సత్తె నపల్లిలో పర్యటించిన బృందం బుధ వారం నాడు  చిలకలూరిపేటలో కి ప్రవేశించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతి పక్షా పార్టీలు రెండు బీజేపీకి  తొత్తులు అయ్యాయని పవన్ కళ్యాణ్ వాసన వచ్చే లడ్డును తింటూ కేంద్రంలోని బిజెపిని భుజాల మీదకి ఎత్తుకొని వదల కుండా కుండా ఉండిపోయా రన్నారు. రాష్ట్రంలో ధరల పెరుగుదల, కరువు, నిరుద్యోగం తాండవిస్తుందని అప్పుల బాధ లేక మంగళవారం కర్నూలు జిల్లాలో ఒక  రైతు ఆత్మహత్యకు గురైన సంఘటన  ఈ ముఖ్యమంత్రి కి కనిపించలేదా అని ప్రశ్నించారు. కేంద్రంలో మన బిజెపి దేశాన్ని అమ్మేస్తుందని రైళ్లు విమానాలు విశాఖ ఉక్కు ఇప్పటికే ప్రధాని అంబానీలో కట్టబెట్టారని జాతీయ రహదారులు కూడా అంచెలంచలుగా అమ్ముతు భారీగా తోలుగేట్ల రేట్లను విదుంచుకో  వచ్చని బహిరంగంగానే చెబుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి అంటే నవరత్నాలు అమలు పరచడం కాదన్నారు. ప్రత్యేక హోదా లేదు.. పోలవరం పూర్తి కాలేదని అదేమంటే కేసులు పెట్టి ప్రతిపక్ష నోరు నొక్కేస్తు న్నారని ఆయన తీవ్రంగా విమర్శించా రు. బటన్ నొక్కులు కార్యక్రమం చిన్న పిల్లలైనా చేస్తారని దీనికి ముఖ్య మంత్రి లాంటి వ్యక్తి అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాలలో ఎటువంటి అభివృ ద్ధి కార్యక్రమాలు చేయలేదని.. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వ్యవసాయ కరువు కోరల్లో చికెజుకుని  పనులు లేక వివిధ జిల్లాల నుంచి వేల సంఖ్య లోరైతులు, పనులేక పేదలు వలస పోతున్నారని అన్ని మండలాల్లో కరువు తీవ్ర స్థాయిలో ఉంటే ఈ ముఖ్యమంత్రి బహిరంగముగానే బహిరంగ సభలో అదేమీ లేదు వర్షం కురుస్తుందని జగన్ చెప్పటం విడ్డూరం కాదా అన్నారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలు  అమలు పరచలేదన్నారు. రాజధాని లేదు.. పరిశ్రమలు రావు.. రైల్వే జోన్ లేదు.. పోలవరం పూర్తి కావని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్కు చిత్తశుద్ధి లేదని అన్నారు. రాష్ట్రంలో అధికారం కోసం జగన్ చంద్రబాబు పోట్లాడు కుంటున్నా రన్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా వీరితో కలిసి రాష్ట్రాన్ని తాకట్టు పెడు తున్నార న్నారు. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి కోసం బిజెపి పై సాగే పోరాటంలో కల సి రావాలని ఆయన అధికార, ప్రతి పక్ష,ప్రజలను కోరారు. అందులో భా గంగా ఈ నెల 15వ తారిఖున విజ యవాడలో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు,అభిమా నులు తరలి రావాలన్నారు. అనంత రం సిపిఎం  రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ నవరత్నాలు తప్ప ప్రభుత్వం అభివృ ద్ధి పను లు చేయడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల అసంతృప్తి రోజు రో జుకి ఎక్కువ అవుతుందన్నారు. అభి వృద్ధి ప్రణాళికని అమలు చేయాలని ప్రజల కు భద్రత కల్పించాలన్నారు. మద్యం షాపులు సంవత్సరానికి 20 శాతం తగ్గిస్తా మని చెప్పి మాట తప్పిదన్నా రు. ఒక మద్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంలో మొదట్లో 16 వేల లక్ష లు పోస్తే ప్రస్తుతం 23,500 కోట్ల రూ పాయల గా వస్తుం దని తీవ్రంగా విమ ర్శించారు రైతుల కు గిట్టుబాటు ధర. లు ఇవ్వని ప్రస్తు తం కందిపప్పు 170 రూపాయలుగా అమ్ముతు న్నారన్నా రు. నిత్యవసర వస్తువుల రేట్లు అంద కుండా పోయా యని అదే మాధవి ఆ దాయాలు పెరగా లేదని, రైతులకు గి ట్టుబాటు ధరలు లేక ఆత్మహత్య చే సుకుంటు న్నా రన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్వాక్రా మ హిళల డబ్బులు వాడు కోవడం సిగ్గు  మాలిన తనానికి నిదర్శన మన్నారు. అదాని అంబానీ అడిగింది ఇవ్వకపో తే ఈడీలు, సిబిఐలు, ఇన్కమ్ టాక్స్ దాళ్ళు జరుగుతాయని ఎద్దేవా చేశా రు. 3 వేల కోట్ల ఖరీదైన విశాఖ ఉక్కున 30 కోట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నిదర్శనం అన్నారు ఇన్ఫోసిస్ కంపెనీ అధినేత నారాయణమూర్తి 10 గంటలు పని చేయమంటాం ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించాలి అన్నారు బిజెపి దురాగతాల నుంచి రాష్ట్ర హక్కుల్ని నిలబెట్టుకోవాలని కోరుతూ నవంబర్ 15వ తేదీన విజయవాడలో జరిగేటటువంటి ప్రజారక్షణ భేరి సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు ప్రజలు పోరాట బాట పట్టాలని బిజెపి అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టాలన్నా రు. పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ మాట్లాడు తూ అభివృద్ధి అంటే నవరత్నాలు కాదన్నారు అసమానతలు లేని సమాజం నిర్మాణం కోసం కృషి చేయాలి అన్నారు ఎడవల్లి మురికిపూడి ఇలాంటి గ్రామాలలో సుమారు 700 ఎకరాలు ఉండదని దళితులను నిర్బంధించి వారి భూములను లాక్కోవటం అన్యాయమన్నారు పదివేల రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తించదనడం అన్యాయం అన్నారు రైతులకు కరువు నివారణ చర్యలు లేక వలసబోతున్నారన్నారు అధిక ధరల నియంత్రణ లేదన్నారు పేదలకు చౌక డిపోల ద్వారా నిత్యవసర సరుకులను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు 400 మండలాల్లో ప్రస్తుతం కరువు తాండవం చేస్తుంటే 13 మండలాల్లో అధీను కొద్దిగా ఉందని దారుణమైన విషయం అన్నారు ఈ సంవత్సరం ప్రతి రెండు మూడు క్వింటాళ్ల కన్నా ఎక్కువగా రాదని ఒక ఎకరాకు 40 వేలు దాకా ఖర్చులు రైతులు పెట్టి ఉన్నారన్నారు. టిడిపి మేనిఫెస్టోలో రైతులకు 20వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారని అది ఎలా ఇస్తారో చెప్పాలన్నారు. అందులో కౌలు రైతులు ఉన్నారా.?.. అని ప్రశ్నించారు.అధికార, ప్రతిపక్ష, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మోడీకి అను కూలంగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారన్నారు. వైయస్సార్ ఇంటింటి ప్రోగ్రాంలో నాయకులను ఈ విషయాలపై నిలదీయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులకే ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర నాయకులు రమాదేవి కే ఉమామహేశ్వరరావు భాస్కరయ్య సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ భాస్కర్ సిపిఎం సీనియర్ నాయకులు నూతలపాటి కాళిదాసు గుళ్ళు శంకర్రావు తోకల కోటేశ్వరరావు కే లక్ష్మీశ్వర్ రెడ్డి ఏపూరి గోపాలరావు జి రవి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముందుగా ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నాగరాజు ఆధ్వర్యంలో కళాకారులు విప్లవ గీతాలను ఆలపించి ప్రజలను ఆకర్షించారు. ఈ కార్యక్రమం సిపిఎం పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు ప్రముఖులను స్టేజి మీద ఆహ్వానించారు.

ramadevi in chilakaluripeta

---------------------0000000000000000000-------------------------

ghafoor

అధికారమే పరమావధిగా వైసిపి, తెలుగుదేశం పార్టీలు : ఎం.ఎ గఫూర్‌

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి కేంద్ర ప్రభుత్వం కొమ్ముకాస్తున్న వైసీపీ, టిడిపి, జనసేన పార్టీ లను ప్రజలు నీలదీయాలని  సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ.గఫూర్‌ పిలుపునిచ్చారు. సిపిఎం చేపట్టిన ప్రజారక్షణభేరిలో భాగంగా బుధవారం బాపట్ల జిల్లా లోని పర్చూరు, చీరాల లో జరిగిన బస్సు యాత్ర,బహిరంగ సభల్లో గఫూర్‌ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన మేలు ఏమి లేదన్నారు. రాష్టానికి ఇచ్చిన ఏ ఒక్కహామీ అమలు చేయకపోగా అదానీ, అంబానీలకు కేంద్రం కొమ్ము కాస్తుందన్నారు. దేశంలో నల్ల డబ్బు ఉండి నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్న మోడీ, జనంచేత బ్యాంకుల్లో జన్ ధన్  ఖాతాలు తెరిపించారన్నారు. రూ 15 లక్షలు జనం ఖాతాల్లో వేయిస్తానన్నాడని, కాని నేటికీ ఒక్క రూపాయి కూడా వచ్చింది లేదన్నారు. కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తుంటే సిఎం జగన్‌ గానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు గానీ ఏమి పట్టడం లేదన్నారు.జనసేన నేత పవన్‌కళ్యాణ్‌ కూడా  కేంద్రానికి భజన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు గురించి సిఎం జగన్‌కు పట్ట లేదన్నారు. సియం జగన్ పరిస్థితి పంజరం లో చిలక లా ఉందన్నారు.బటన్‌ నొక్కడానికి ఎదో ఒక జిల్లా కు వెళ్లడం, బటన్ నొక్కడం వచ్చి ఇంట్లో కూర్చోవడం జరుగుతుందన్నారు. రాష్టం లో 2014 నుంచి 19 వరకు టిడిపి, అప్పటి నుంచి నేటి వరకు వైసీపీ లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయన్నారు. ఇరు పార్టీలు రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశాయన్నారు. అధికారమే పరమావధిగా ఉంటూ ఇరువురు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్నారు. మన పిల్లలకు ఇక్కడ భవిష్యత్తు లేక ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలసలు వెళ్తున్నారన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ లు గుడ్డిగా కేంద్రానికి మద్దతు ఇవ్వడం వల్ల రాష్ట్రం నష్టపోతుందన్నారు.ప్రజల పేరు చెప్పి సియం జగన్   రూ 10 లక్షల కోట్ల అప్పు తెచ్చాడని,అందులో  రూ 2.50 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేస్తే, మిగతా రూ 7.50 లక్షల కోట్లు పక్కదారి పట్టాయన్నారు.సియం జగన్ రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పరు , నిరుద్యోగులకు ఏం చేశారో తెలియదు, రైతులను ఆదుకోరు, వ్యవసాయ కూలీల సమస్యలు పట్టదు. వర్షాధారాన్నిబట్టి కరువు మండల ప్రకటన చేస్తామంటారని గఫూర్ రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. పేదలు ఉపాధి కోసం వలసలు పోతున్నారని, నిరుద్యోగులు స్థానికంగా ఉద్యోగాలు లేక  బెంగుళూరు, చెన్నై లాంటి పట్టణాలకు పోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు.. రైల్వే జోన్ లేదు.. పోలవరం ప్రాజెక్టు గురించి ఎవరికీ పట్టలేదు అన్నారు.రాష్ట్ర అభివృద్ధిపై సిఎం జగన్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి, ప్రాజెక్టులు పూర్తి కావాలన్నారు. టిడిపి వారు సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటున్నారని వారు ప్రజలకు ఏం చేస్తారో చెప్పడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15న సిపిఎం నేతృత్వంలో విజయవాడలో జరుగనున్న ప్రజా గర్జనభేరిలో ప్రజలందరూ పాల్గొని సిపిఎంకు మద్దతు తెలపాలన్నారు.   ప్రజా గర్జన సభలో  సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు డి.రమాదేవి, సీపీయం నేతలు కె ప్రభాకర రెడ్డి,కె.ఉమామహేశ్వరరావు, యం.భాస్కరయ్య,దయా రమాదేవి తదితరులు పాల్గొన్నారు.