
ఢిల్లీ : టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం తాజాగా విడుదల చేసిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2024 జాబితాలో భారత్‌కు చెందిన 91 విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. గతంలో ఇన్ని భారత విశ్వవిద్యాలయాలు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్థానం దక్కించుకోలేదు. 2016లో ఈ జాబితాలో భారత్‌కు చెందిన వర్సిటీల సంఖ్య కేవలం 16. ఇప్పుడు ఆ సంఖ్య 91కి పెరిగింది. భారత్‌లోని అగ్రగామి విద్యాసంస్థ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ)-బెంగళూరు ఈ జాబితాలో టాప్-250లో స్థానం దక్కించుకుంది. దక్షిణాదిన పేరుగాంచిన అన్నా యూనివర్సిటీ టాప్-600లో ఉంది. జామియా మిలియా ఇస్లామియా, మహాత్మాగాంధీ వర్సిటీ, శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ కూడా టాప్-600లో ఉన్నాయి. ఐఐటీ-గువాహటి టాప్-800లో నిలిచింది. ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.