Aug 07,2023 15:09

ప్రజాశక్తి-విజయవాడ: డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవో నెంబర్‌ - 107, 108 రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వర్సిటీ ముట్టడికి యత్నించారు. ఈ జీవోల వల్ల పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతున్నారని నిరసన తెలిపారు. దీంతో యునివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముట్టడికి వచ్చిన ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌ బాబు, ఇతర నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.