Oct 24,2023 15:46

ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : వరల్డ్‌ పోలియో డే సందర్భంగా మంగళవారం పాలకొల్లు రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో పట్టణంలో పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలియో ప్రపంచ దేశాలలో ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌లో మాత్రమే మిగిలి ఉందని, ఈ రెండు దేశాల్లో ఇంకా పోలియో కేసులు ఉన్నాయని దీంతో భారత్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోటరీ క్లబ్‌ మాజీ అధ్యక్షులు మద్దాల వాసు కోరారు. పోలియో మహమ్మారిని నిర్మూలించడం రోటరీ లక్ష్యం అని 5 సంవత్సరాలు లోపు చిన్నపిల్లలు పోలియో చుక్కలు వేసుకోవాలని, పోలియో నిర్మూలనకు రోటరీ ఇంటర్నేషనల్‌ నుండి అధిక మొత్తంలో ఫండ్‌ ని సేకరించి పోలియో ఫండ్‌ గా ఇవ్వడం కూడా జరుగుతుందని రోటరీ క్లబ్‌ ప్రెసిడెంట్‌ పెనుమాక రామ్మోహన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ సెక్రటరీ రావాడ సతీష్‌, ట్రెజరర్‌ ముత్యాల ప్రదీప్‌ ,రోటరీ అసిస్టెంట్‌ గవర్నర్‌ యిమ్మిడి రాజేష్‌ ,పాస్ట్‌ ప్రెసిడెంట్‌ మద్దాల రాంప్రసాద్‌ , చందక రాము, ముత్యాల శ్రీనివాసరావు, షేక్‌ పీర్‌ సాహెబ్‌, డా. ముచ్చర్ల సంజరు,కటారీ నాగేంద్ర కుమార్‌, రోటరీ సభ్యులు కానూరు ప్రభాకర్‌ రావు, శిరిగినీడి రాము ,ఎన్‌. ఎన్‌. మూర్తి, మేడికొండ శ్రీనివాస్‌, పోతాబత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు.