
ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : పాలకొల్లు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పెనుమాక రామ్మోహన్ ఆధ్వర్యంలో రామా స్టూడియోలో శనివారం ప్రపంచ ప్రోటోగ్రఫీ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. పాలకొల్లుకు ఫోటోగ్రఫీలో మెలకువులు నేర్పి వందలాది మంది శిష్యులను తయారుచేసిన వ్యక్తి కావలి తాతయ్య అని అన్నారు. ఆయన స్థాపించిన రామా స్టూడియోలో ఆనాటి కెమెరాలతో పాటు నేటి ఆధునిక ఫోటోగ్రఫీ, లైటింగ్ నిర్వహణ ఏ విధంగా ఉండాలిపై రామా స్టూడియో అధినేత కావాలి నగేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో నగేష్‌ను రోటరీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి పాలకొల్లు రోటరీ క్లబ్ కార్యదర్శి రావాడ సతీష్, కోశాధికారి ముత్యాల శ్రీవత్స, అసిస్టెంట్ గవర్నర్ యిమ్మడి రాజేష్ , పాస్ట్ ప్రెసిడెంట్స్ ముత్యాల శ్రీనివాస్, చందక రాము, పీర్ సాహెబ్, మద్దాల వాసు, రోటరీ సభ్యులు జక్కంపూడి కుమార్, కానూరి ప్రభాకర్, ఎన్‌ఎన్.మూర్తి, కొనిజేటి గుప్త పాల్గొన్నారు.