Sep 26,2023 12:16

విజయనగరం : ఈనెల 29న ప్రపంచ హార్ట్‌ డే సందర్భంగా ... అవగాహన ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు తిరుమల మెడికవర్‌ చైర్మన్‌ డాక్టర్‌ తిరుమల ప్రసాద్‌ తెలిపారు. మంగళవారం స్థానిక తిరుమల మెడికల్‌ హాస్పిటల్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రపంచ హార్ట్‌ డే సందర్భంగా బ్రోచెస్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా తిరుమల ప్రసాద్‌ మాట్లాడుతూ ... ప్రపంచంలో మరణాలకి ముఖ్య కారణం ప్రధానంగా హార్ట్‌ ఎటాక్‌, క్యాన్సర్‌ , కిడ్నీ సమస్యలు అని అన్నారు. హార్ట్‌ ఎటాక్‌ నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చునని తెలిపారు. హార్ట్‌ ఎటాక్‌ కి ప్రధానంగా షుగర్‌, బిపి, ఉభయ సిటీ వ్యాధులు, మెంటల్‌ టెన్షన్‌, ఒక్కొక్కసారి సడన్‌ గా కూడా రావచ్చునని అన్నారు. వీటన్నిటి నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సరైన సమయంలో వైద్యం తీసుకుంటే ప్రాణం కాపాడవచ్చునని తెలిపారు. వీటిపైన ఈనెల 29న స్థానిక కోట వద్ద నుంచి హాస్పిటల్‌ వరకు ఒక అవగాహన ర్యాలీ ఉంటుందని ప్రకటించారు. అనంతరం హాస్పిటల్‌ వద్ద ఫ్రి మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. ఆ మెడికల్‌ క్యాంపులో అవగాహన కార్యక్రమం ఉంటుందని, ఎవరికైనా డాక్టర్లు సంప్రదించినప్పుడు అడగలేని విషయాలు ఉంటే హార్ట్‌ ఎటాక్‌ పట్ల డాక్టర్లను అడిగి తెలుసుకోవచ్చునని అన్నారు. మెడికల్‌ క్యాంపులో షుగర్‌, బిపి వంటివి పరీక్షలు నిర్వహించబడునని తెలిపారు. గతంలో విజయనగరం పట్టణ కేంద్రంలో ఉన్న జర్నలిస్టులు ప్రెస్‌ క్లబ్‌ ద్వారా తిరుమల వారి హెల్త్‌ కార్డులు అడిగారు. వాటిని ఈరోజు మెడికవర్‌ చైర్మన్‌ చేతులు మీదుగా అందజేశారు.