Nov 19,2023 13:29

విజయవాడ: కాసేపట్లో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీలో విజయవాడ సహా పలుచోట్ల భారీ స్క్రీన్లను ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఏర్పాటు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మూడు స్క్రీన్లు సిద్ధం చేశారు. ఫైనల్‌ పోరును భారీ స్క్రీన్లపై తిలకించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. దీంతో స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది.