సాహిత్య రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి చనిపోయి ఏడాది అయిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు తానా సంస్థతో కలిసి సిరివెన్నెల సంపూర్ణ సాహిత్యాన్ని వెలువరుస్తున్నారు. అందులో కొన్ని సంపుటాలు ఇప్పటికే వచ్చాయి. మరి కొన్ని రాబోతున్నాయి. ఆయన జయంతి (మే 20) సందర్భంగా రెండు అమూల్యమైన పుస్తకాలు రాబోతున్నాయి. అందులో మొదటిది 'పూర్ణత్వపు పొలిమేరలో'. సీతారామశాస్త్రి వ్యక్తిత్వ విశ్లేషణను తెలియచేసే ఈ పుస్తకాన్ని వారి సోదరుడు శ్రీరామశాస్త్రి రచించి, సంకలనం చేశారు. ఈ నెల 20వ తేదీ హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆవిష్కరించ బోతున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా, ప్రముఖ గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ హాజరుకానున్నారు. మే 19న తేదీ రవీంద్ర భారతి సమావేశ మందిరంలో సీతారామశాస్త్రికి సంబంధించిన 'సిరివెన్నెల రసవాహిని' మరో పుస్తకాన్ని కిన్నెర ఆర్ట్ థియేటర్స్ సంస్థ ఆవిష్కరించబోతోంది. రచయిత డాక్టర్ పైడిపాల ఈ పరిశోధనాత్మక రచన చేశారు.










