Sep 13,2023 16:15

ఇంటర్నెట్‌డెస్క్‌ : వర్కింగ్‌ మదర్స్‌ వల్ల పిల్లలకు చాలా బెనిఫిట్స్‌ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా..!

- తల్లి ఉద్యోగం చేస్తుంటే.. తన పిల్లలకు ఎన్నో ప్రయోజనాలున్నాయట. పిల్లలు చదువు విషయంలో సందేహాలుంటే తల్లి నివృత్తి చేస్తుంది. చదువుకున్న తల్లి అయితే.. పిల్లలకు సందేహాలను మాత్రమే నివృత్తి చేస్తుంది. అదే ఉద్యోగం చేసే తల్లి అయితే చిన్నప్పటి నుంచే కష్టపడడం ఎలాగో చెబుతుంది. గురువులా క్రమశిక్షణ, అంకిత భావం వంటి ప్రాధాన్యతల గురించి వివరించడంతో.. పిల్లలు నేర్చుకునే క్రమంలోనే వీటిని అలవర్చుకుంటారు.

- ఇంట్లో పని, ఆఫీస్‌లో వర్క్‌, పిల్లల్ని చూసుకోవడం ఇన్ని పనులను వర్కింగ్‌ ఉమెన్‌ బ్యాలెన్స్‌ చేస్తుంది. వర్కింగ్‌ మదర్‌ నుంచే పిల్లలు కూడా అన్నీ పనులను బ్యాలెన్స్‌ చేయడం నేర్చుకుంటారు. అలాగే పక్కా ప్రణాళికతో పనిని పూర్తి చేయడం కూడా నేర్చుకుంటారు.

- పిల్లలు తీసుకునే ఆహారం నుంచి.. నిద్రపోయే వరకు తల్లి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఉద్యోగం చేసే తల్లి అయితే.. పిల్లలకిష్టమైన ఫుడ్‌ మాత్రమేకాదు.. వారికి పౌష్టికాహారాన్ని అందిస్తుంది. దీంతో చిన్నారులు తరచూ అనారోగ్యం పాలుకాకుండా ఉంటారు.

- పిల్లలకు ఏ సందర్భంలోనైనా భయం లేకుండా తల్లి ధైర్యం చెబుతుంది. నలుగురిలో త్వరగా కలిసిపోయేలా జాగ్రత్తలు చెబుతంది. అలాగే కుటుంబ పరంగా ఆర్థికంగానూ పిల్లల ఎదుగుదలకు ఎంతో సపోర్ట్‌గా నిలుస్తుంది.