హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు నగర పోలీసులు కీలక సూచన చేశారు. నగరంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులంతా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరారు. వర్క్ ఫ్రం హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు సూచించారు. అత్యవసర సేవల ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి ఇండ్లకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు. ఈ మేరకు తెలంగాణ పోలీసు శాఖ సోషల్ మీడియాలో పలు సూచనలు చేసింది.