ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా) : స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై ఎం.సూర్య భగవాన్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ ... మండలంలోని అనుమతులు లేని ప్రదేశంలో బాణాసంచా దుకాణాలు నిర్మించి అమ్మకాలు చేపట్టకూడదని అన్నారు. పండుగ సందర్భంగా యువత బైకులకు సైలెన్స్‌ర్ తీసి మద్యం సేవించి వీధుల్లో రాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పండుగ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందినీ కలిగించకుండా పబ్లిక్ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చకూడదని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకొని ఇసుక, నీటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా 100 నెంబర్ కు లేదా పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయాలని, కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో దీపావళి పండుగను తగు జాగ్రత్తల మధ్య చేసుకోవాలని ఎస్సై ఎం.సూర్య భగవాన్ సూచించారు.