నర్సీపట్నం (అనకాపల్లి) : నర్సీపట్నం ఆర్డిఓ జయరాం, పిడి ఉషారాణి, అనకాపల్లి డిఎంఎండిహెచ్‌ఓ.కె.వి.జ్యోతి అధ్యక్షతన అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఐదు సెక్టార్లకు సంబంధించి మాడుగుల రావికమతం, కోటవురట్ల, నర్సీపట్నం, నక్కపల్లి 52 అంగన్వాడి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు చేపట్టారు. ఈ ఉద్యోగాలలో టీచర్లు తొమ్మిది ఆయా ఉద్యోగాలు 38 మినీ కార్యకర్తలు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నర్సీపట్నము సిడిపిఓ మేరీ సువార్తమ్మ, కోటవుట్ల టిడిపివో సుజాత, నక్కపల్లి సిడిపిఓ శ్రీవిద్య, తదితరులు పాల్గన్నారు. ఇంటర్వ్యూలకు భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు. నిరుద్యోగ మహిళలు ఎంతో ఆశతో ఇంటర్వ్యూలకు హాజరు కాగా బహిరంగంగా కొంతమంది మహిళలు అధికార పార్టీకి చెందిన నాయకుల సిఫార్సు లెటర్లతో ఇంటర్వ్యూలకు హాజరు అయ్యారని తెలుస్తుంది. ఇంటర్వ్యూలు తూతు మంత్రంగానే జరిగాయని అధికార పార్టీ నాయకులకు సంబంధించినవారికే ఉద్యోగాలు ఇచ్చేలాగా పరిస్థితులు ఉన్నాయని పలువురు నిరుద్యోగ మహిళలు వాపోతున్నారు.










