- మద్దత్తు తెలిపిన సిపిఎం
ప్రజాశక్తి-తుగ్గలి (కర్నూలు) : తుగ్గలి మండలం పరిధిలోని దేశాయి తాండాలో నెలకొన్న మంచి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున కాలిబిందెలుతో మంగళవారం రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. మహిళలు చేపట్టిన నిరసనకు సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములు సంగిభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. రాస్తారోకోతో కొంత సేపు గుత్తి, పత్తికొండ రోడ్డు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ.. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ పంచాయతీ మజారా గ్రామమైన దేశాయి తాండాలో మంచి నీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకోని వచ్చిన వారు పట్టించు కోవడం లేదన్నారు. కేవలం కంటి తుడుపు చర్యగా మంచి నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి మరల ఎత్తివేసినట్లు తెలిపారు. అదేవిదంగా జొన్నగిరి సచివాలయంలో కూడ పలు సార్లు ఫిర్యాదు చేసిన వారు పట్టించు కోలేదని వారు వాపోయారు. గత మూడు నెలలు గ్రామంలో మంచి నీటి సమస్యను అరికట్టలేని అధికారులుపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అయన కోరారు. సమస్యని పరిస్కారం చేయక పొతే దశలు వారీగా ఆందోళన చేస్తామని ఆయన తెలిపారు. ఈ రాస్తారోకోలో మహిళలు గాజుల గిరిదేవి, చల్లా సరోజ, దూదేకొండ రంగమ్మ, కాలనీ వాసులు పాల్గొన్నారు.










