తాడేపల్లి : తమ భూమిని అధికారులు అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారంటూ భీమవరం జిల్లాకు చెందిన ఓ మహిళ(60) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తాడేపల్లిలోని సీఎం కార్యాలయం వద్ద గురువారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. భీమవరం జిల్లాకు చెందిన శారద అనే మహిళ తమ భూమిని అధికారులు అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఎన్నో సార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా ,ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు. సీఎం కలవక పోవడంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకోబోయానని చెప్పారు.










