Jul 10,2023 14:33

కర్ణాటక : కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల ఓ సామాన్య వ్యక్తి అసెంబ్లీలోకి చొరబడి, ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న ఘటన మరువకముందే.. తాజాగా ఓ మహిళ కత్తితో అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. వెంటనే గుర్తించిన భద్రతా సిబ్బంది.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. అసెంబ్లీలోకి వెళ్లేవారిని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే అధికారులు లోపలికి అనుమతిస్తారు. ఈ క్రమంలో సోమవారం ఓ మహిళను తూర్పు గేటు నుంచి ఆ మహిళ లోపలికి వస్తుండగా.. ఆమె బ్యాగ్‌ను స్కానింగ్‌ మెషిన్‌లోకి పంపారు. అందులో ప్రమాదకర వస్తువులు ఉన్నట్లు సిగల్‌ వచ్చింది. తనిఖీ చేయగా.. ఆమె వద్ద కత్తి బయటపడింది. పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకుని సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆమె ఎవరనే వివరాలు ఇంకా తెలియరాలేదు.