ప్రజాశక్తి - చిన్నగంజాం (బాపట్ల) : ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో మద్యం అమ్మకం నిషేధం అని అలాంటివారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ కే.సురేష్ అన్నారు. మండలంలోని కడవకుదురు గ్రామంలో మద్యం అమ్ముతున్న మహిళ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గ్రామంలో జరుగుతున్న జాతర నేపథ్యంలో ... ప్రభుత్వ దుకాణాల వద్ద మద్యం సీసాలను కొనుగోలు చేసి గ్రామంలో అమ్ముతున్న ఎస్ పద్మపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి అందిన సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి రైడ్ చేసినట్లు చెప్పారు. రెండు బ్రాండ్లకు చెందిన పది మద్యం సీసాలు లభ్యమయ్యాయని మహిళపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.










